22-11-2025 05:36:11 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలోని కాకతీయ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఎస్.ఎల్.సి(స్కూల్ లీడ్ కాన్ఫరెన్స్) ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. ఎల్ కేజీ నుండి 5 క్లాస్ విద్యార్ధులు వివిధ రకాల ప్రాజెక్ట్ లతో ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలలో నైపుణ్యం గుర్తించి విద్యార్థులు స్వతహాగా వివిధ రకాల ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగిందని, ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వివరణగా వివరించి చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రవికిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి రెడ్డి, పావని రెడ్డి, లీడ్ అకాడమిక్ అడ్వైజర్ అరుణ్, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.