calender_icon.png 16 August, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవీ క్లబ్ ఆద్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

16-08-2025 12:10:04 AM

మణుగూరు,(విజయక్రాంతి): పట్టణంలోని వాసవీ సురక్ష బస్టాండ్ వద్ద వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవం ఆద్వర్యంలో  79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక లను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ అధ్యక్షుడు మిట్టపల్లి శ్యామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. త్యాగ నిరతితో ఎందరో అమరవీరులు, దేశభక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమై నవని  తెలిపారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన బలిదానాలు, త్యాగాల చరిత్రను  స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకు చేరేదాకా కృషి కొనసాగాలని ఆకాంక్షిచారు. అమరుల త్యాగాలను గౌరవించి, స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకు చేరి, దేశ సమ గ్రాభివృద్ధికి దోహదం చేసిన నాడే దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ఇను మడిస్తాయని పేర్కొన్నారు. అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.