04-07-2025 11:22:06 PM
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పింగళి నాగరాజు
ములుగు(వెంకటాపూర్)జూలై4(విజయక్రాంతి): సమాజంలో నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి మౌలిక వసతులు తీర్చడంలో ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ముందున్నదని లక్ష్మీదేవిపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ అన్నారు. వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సేవా భావమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రియనేస్తం ట్రస్టు అధ్యక్షులు పింగిలి నాగరాజు అభినందనీయులనీ అన్నారు. నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు మరువలేమని తెలిపారు.
ములుగు జిల్లాలో ప్రస్తుతం ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన ఈ సందర్భంగా కొని యాడారు. లక్ష్మీదేవిపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు లక్ష రూపాయలతో టాయిలెట్స్ నిర్మించారని పేర్కొన్నారు నర్సింగాపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ సర్వర్ అహ్మద్ కోరిన వెంటనే విద్యార్థులకు స్కూలు బ్యాగులు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పింగిలి నాగరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు,విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను బోధించాలని సూచించారు. నేటి బాలురే రేపటి భావిభారత పౌరులని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సింగాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి సర్వర్ అహ్మద్,కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రెటరీ సూత్రాల రవి,సీనియర్ ఉపాధ్యాయులు బండి సురేష్,పెండ్యాల సలేంద్రం,మాదాసు సుమన్,ఐఅంగన్వాడి టీచర్ ఎర్రబెల్లి సరోజన,పూర్వ విద్యార్థులు అల్లం రాజు బస్వోజు క్రాంతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఈ రోజు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మెజీషియన్ ద్వారా ఆహల్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు మూఢనమ్మకాలపై పర్యావరణ పై అవగాహన కల్పించడం జరిగింది. మెజీషియన్ వెంకటాపూర్ మండలం కేంద్రానికి చెందిన భాస్కర్ అందరి మన్ననలు పొందారు.