calender_icon.png 15 July, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఐటీసీ సహకారం అభినందనీయం

15-07-2025 12:45:45 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, జులై 14 ( విజయ క్రాంతి ) : ఏజెన్సీ ప్రాంతంలో ఐటీసీ సంస్థ విద్యార్థులకు సహకారం అందించి, ఉచితంగా సైకిళ్ల ను పంపిణీ చేయడం అభినందనీ యమని పినపాక ఎ మ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జడ్పీహెచ్‌ఎస్ కో ఎడ్యుకేషన్ పాఠశాల వి ద్యార్థులకు ఐటిసి ఆధ్వర్యంలో సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఐటిసి చేస్తున్న కార్యక్రమాలు అభినంద నీయమన్నారు. సి ఎస్‌ఆర్ నిధులతో గ్రామాలలో మౌలిక వసతులు, విద్యా, వైద్య రంగాలలో సంస్థ అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు.

ఏజెన్సీలోని పేదల ఆర్థిక అభివృద్ధికి ఐటీసీ అన్ని విధాలా చేయతను అంది స్తుందని,యాజమాన్యం కరోనా సమయంలో కూడా సేవా కార్యక్ర మాలు నిర్వ హించిందన్నారు. కార్యక్రమంలో ఐటీసీ అధికారులు చెంగళరావు, తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో తెల్లూరి శ్రీనివాస్,ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ స్వర్ణ జ్యోతి, హెచ్‌ఎం నాగ శ్రీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, కూరపాటి సౌజన్య పాల్గొన్నారు.