calender_icon.png 29 September, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

29-09-2025 12:26:50 AM

డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు

ఖమ్మం, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి):రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు బోనకల్ మండలం నారాయణపురం వద్ద మధిర నియోజకవర్గ పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా రూ. 333 లక్షల వ్యయంతో రావినూతల నుండి చిన్నబీరవల్లి వయా నారాయణపురం బీటీ రోడ్ నిర్మాణ పనులకు,

తూటికుంట్ల ఎస్సీ కాలనీలో రూ. 66 లక్షల వ్యయంతో నిర్మించే అంతర్గత సిసి రోడ్ నిర్మాణ పనులకు, చింతకాని మండలంలో రూ. 695 లక్షల వ్యయంతో మత్కేపల్లి నుండి తిర్లాపురం రోడ్డు పునర్నిర్మాణం పనులు, నాగిలిగొండ ఎస్సి కాలనీలో 85 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, పాతర్లపాడు ఎస్సి కాలనీలో 85 లక్షల వ్యయంతో లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, కోమట్లగూడెం ఎస్సి కాలనీలో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న.

అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, తిమ్మినేనిపాలెం ఎస్సి కాలనీలో 62 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, చింతకాని ఎస్సి కాలనీలో 44 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, మత్కేపల్లి ఎస్సి కాలనీలో 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, నరసింహాపురం ఎస్సి కాలనీలో 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న.

అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, రైల్వే కాలనీ నాగులవంచ లో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు, తిమ్మినేనిపాలెం లో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణ పనులకు, ముదిగొండ మండలంలో వల్లపురం ఎస్సి కాలనీలో 63.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, గోకినేపల్లి ఎస్సి కాలనీలో 44 లక్షల వ్యయంతో నిర్మించనున్న.

అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, వల్లభి ఎస్సి కాలనీలో 41.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, సువర్ణాపురం ఎస్సి కాలనీలో 34 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, చిరుమర్రి లో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు, మధిర మండలంలో సిరిపురం ఎస్సి కాలనీలో 170 లక్షల వ్యయంతో నిర్మించనున్న.

అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు,నిధానపురం ఎస్సి కాలనీలో 88 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, మహాదేవపురం ఎస్సి కాలనీలో 142 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన లు చేసారు. ఈ కార్యక్రమంలో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎస్‌ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఇఇ తానేశ్వర్, పీఆర్ ఇఇ మహేష్ బాబు, ఏడి అగ్రికల్చర్ విజయ్ చందర్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.