calender_icon.png 10 July, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.5,381.87 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక

10-07-2025 12:49:39 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, జూలై 9 (విజయ క్రాంతి): ప్రాధాన్యత రంగానికి బ్యాంకులు వచ్చే సంవత్సరం పూర్తి లక్ష్యాలు సాధించుటకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో  బ్యాంకు మేనేజర్లు, వివిధ బ్యాంకు కంట్రోలర్స్ తో బ్యాంకు రుణాల వివరాలు, బ్యాంకు లింకేజీ ప్రభుత్వ పథకాలపై డిసిసి డిఎల్ ఆర్ సి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు . ఈ సందర్బంగా 2025- 26 వార్షిక సంవత్సరమునకు... 5381. 87 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ నిర్ణయనికి అనుగుణంగా మహిళా స్వయం సంఘాలకు రుణాలను అధిక మొత్తంలో అందించాలని కలెక్టర్ కోరారు మత్స్య కారుల సహకార సంఘాలకు రుణాలను  పెంచాలన్నారు, పశు పెంపకం, చేనేత రంగాలకు కూడా రుణ మంజూరు కావాలన్నారు.

Pm కూసుమ్, ఇందిర మహిళా శక్తి  పథకాల అమలు కు బ్యాంకర్ లు  సహకరించాలన్నారు  జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2024 - 25 ప్రకారం..  వ్యవసాయ రంగానికి  3477.70 లక్ష్యం కాగా..అందులో..2658.67 కోట్ల రూపాయలు,పంట రుణల లక్ష్యం 1840.07 కోట్ల లో.. 1538.75 కోట్లు మంజూరు చేశామన్నారు మహిళా సంఘాల రుణాల లక్ష్యం 476.47 కోట్లు కాగా అంతకి మించి 528.72 కోట్లు మంజూరు చేసామన్నారు.

జిల్లా వార్షిక ప్రణాళిక 2025-26 కు సంబంధించి....5381.87 కోట్లు కేటాయించగా... పంటల రుణాలు 2482.11 కోట్లు, మొత్తం వ్యవసాయ రుణాలు  3811.67 కోట్లు, ప్రాధాన్యత రంగానికి 4535.72 కోట్ల రూపాయలు,ఆప్రాధన్యత రంగానికి  846.15 కోట్లు కేటాయించారు.   డిఆర్డిఏ వసంత,  LౄM మూర్తి  ఆర్.బి.ఐ ఏజీఎం చేతన్,నాబార్డ్ ఏజీఎం, డి ఎ ఓ రామారావు  వివిధ బ్యాంక్ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.