08-08-2025 02:03:09 AM
పెబ్బేరు ఆగసు 7 : మండల కేంద్రంలోని మత్స్య కళాశాల నూతన ప్రిన్సిపాల్ సాకారం ను గురువారం వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా ఆయనను శాలువ తో సత్కరిం చారు. కళాశాల అభివృద్ధికి తమవంతు కృ షి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులను సరైన రీతిలో తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కోరారు.
మత్స్య కళాశాల నుంచి పెబ్బేరు పట్టణానికి సర్వీసు రోడ్డు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్య క్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామన్ గౌడు, యుగంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేంద్ర గౌడు, రాములు తదితరులు పాల్గొన్నారు.