calender_icon.png 8 August, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్వర పీడుతులతో ప్రభుత్వ ఆసుపత్రి కిటకిట

08-08-2025 12:09:04 AM

  1. వనవాసి కళ్యాణ పరిషత్ వసతి గృహంలో ఒక్క రోజులో 
  2. 12 మంది విద్యార్థులకు అస్వస్థత 
  3. మండల వ్యాప్తంగా విజృంభిస్తున్న జ్వరాలు

చర్ల, ఆగస్టు 7 (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో విజృంభిస్తున్న విష జ్వరాలు, మొగల్లపల్లి కొత్తూరు ,లెనిన్ కాలనీ , చర్ల లింగాపురం పాడు , లక్మి కాలనీ, వంటి పలు  గ్రామాల ప్రజలు విష జ్వరాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, చిన్నపి ల్లలు అధిక శాతంలో జ్వర బాధితులుగా ఉంటున్నారు .

దీంతో ప్రభుత్వ ఆసుపత్రి జ్వర పీడితులతో కటకట లాడుతోంది. ఈ క్రమంలో వనవాసి కళ్యాణ పరిషత్ వసతి గృహం విద్యార్థులకు  గురువారం సుమా రు 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. అస్వస్థత గురైన వారిలో బాడిస వంశీ, మడకం నందా, మడకం శేఖర్, కరటం నాని, మడకం ఈశ్వర్, కరటు చందర్, గొంది రిత్విక్, మడకం అర్జున్, ముచికి ఇదమా, మడకం సంజయ్, ముచికి దీపక్ లు మరొక విద్యార్థి ఉన్నారు,

వీరిలో కొందరు కడుపునొప్పి , కొందరు జ్వరంతో బాధపడుతున్నారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. డాక్టర్లు మాత్రం  టైఫాయిడ్ , డెంగ్యూ వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

మండల వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభించడంతో ప్రభుత్వ, ప్రైవేటు  ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో  వారం రోజులుగా ఓపి సంఖ్య  సుమారు 250 పైగా ఉంటుందని అధిక శాతం వైరల్ ఫీవర్, డెంగ్యూ, టైఫాయిడ్ , మలేరియా వాటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఎక్కువ మంది రోగులకు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉచిత రక్త నమూనాలను (పరీక్షలను) చేస్తున్నారని, మండల ప్రజలు ఉపయోగించుకోవాలని, వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు సంభవిస్తున్నాయని,  ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని ,పరిశుభ్రత పాటించాలని దోమల భారీ నుంచి కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకునీ సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల్ని  సంప్రదించాలని డాక్టర్ సాయి వర్ధన్ , డాక్టర్ పెద్దాడ కాంత్ లు కోరుతున్నారు.