08-08-2025 01:56:54 AM
మహబూబ్ నగర్ టౌన్ ఆగస్టు 7: చరిత్ర విస్మరించిన వీరుడు పండుగ సాయన్న అని పాలమూరు యూనివర్సిటీ యూనివర్సిటీ బిసి సంఘం అధ్యక్షుడు తాయప్ప సాయన్న డాక్టర్ నాగం కుమారస్వామి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పండుగ సాయన్న జీవిత చరిత్ర గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆ కాలంలోనే నిజాం నిరంకుశతాన్ని ప్రశ్నించి జమీందారీ జాగిర్దారి వ్యవస్థకు రజాకార్లకు పెత్తందారులకు తనదైన శైలిలో బుద్ధి చెప్పాడన్నారు.
ఉన్నోళ్ళను కొట్టి పేదోళ్లకు పెట్టిన బహుజన బాంధవుడు అని కొనియాడారు అదే విధంగా మహిళా విద్యకు పెద్దపీట వేశారని చెరువులు తవ్వించారని వారు చేసిన సేవలను ఈనాటి సమాజం స్మరించుకోవాలని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బహుజన సమాజం పండుగల సాయన్న జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ డాక్టర్ ఎం గాలెన్న, డాక్టర్ భూమయ్య వైస్ ప్రిన్సిపల్ న్యాయ కళాశాల, డాక్టర్ కుమారస్వామి డైరెక్టర్ ఎస్సీ ఎస్టీ సెల్ పాలమూరు విశ్వవిద్యాలయం, డాక్టర్ రవీందర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు శాఖ, డాక్టర్ బి పర్వతాలు సోషల్ వర్క్ విభాగం పాల్గొన్నారు.