calender_icon.png 11 August, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాగా చదవండి.. తల్లిదండ్రుల కలలను నిజం చేయండి

11-08-2025 12:04:21 AM

విద్యార్థినిల తో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): బాగా చదువుకుంటూ మీ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తిరుమల గిరిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధినిల  కోసం వండిన ఆహారంను పరిశీలించారు. మెనూ గురించి వాకబు చేశారు. ఆదివారం బగారా రైస్, చికెన్ పెడుతున్నట్లు తెలిపారు. వంట గదిని పరిశీలించారు.

వంట గది పరిశుభ్రంగా లేకపోవడం గమనించి శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. భోజనం చేయడానికి వచ్చిన  విద్యార్థినులతో మాట్లాడారు. "మౌలిక వసతులు, ఆహారం ఎలా ఉంది..? రుచికరంగానే ఉందా..? రోజు మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా..? ఎలా చదువుతున్నారు..? డిగ్రీ తర్వాత  ఏం చేద్దామని అనుకుంటున్నారు..? విద్యార్థినులను అడిగి వారి ఆలోచనలు తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలని సూచించారు.