11-08-2025 12:04:10 AM
చికిత్స కోసం వెళ్ళి..
విగత జీవిగా మారి..
తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు
మహబూబాబాద్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): అనారోగ్యం పాలైన ఓ వ్యక్తి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లి ప్రమాదవశాత్తు భవనం పై నుండి జారి పడి దుర్మరణం పాలన ఘటన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన నాయిని ఐలయ్య (57) అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతన్ని శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఉదయం ఐలయ్య ఆస్పత్రి భవ నం పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు అక్కడి నుండి జారిపడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు.
మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కాగా ఐలయ్య బ్యాండు మేళం గ్రూపు సభ్యుడిగా గ్రామంలో మంచి పేరు ఉంది. చికిత్స కోసం పోతే ప్రాణాలు పోయాయని, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీర య్యారు. ఐలయ్య పార్థివ దేహానికి పెద్ద కుమార్తె లావణ్య తలకొరివి పెట్టింది.