calender_icon.png 11 August, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లిలో భారీ చోరీ

11-08-2025 12:05:57 AM

-తాళం వేసిన ఇండ్లకు కన్నం

-బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఆగస్టు 10 (విజయ క్రాంతి): రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లిన 9 ఇండ్లలో దొంగలు పడి భారీగా బంగారం, వెండి నగలతో పాటు లక్షన్నర నగదు అపహరించిన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. పట్టణంలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో తాళం వేసిన ఇండ్లలో దొంగలు తరబడి 30 తులాల బంగారం, 30 తులాల వెండి, లక్షన్నర రూపాయలు అపహరించారని బాధితులు వాపోయారు. 

ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం బాధితులను పరామర్శించారు. దొంగతనం జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. తక్షణం దొంగలను పట్టుకోడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోలింగ్ పెంచాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.