08-06-2025 07:58:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): పాత మద్దిపడగ గ్రామంలో జరుగుతున్న బడిబాట 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రామారావు(District Education Officer Rama Rao) మాట్లాడుతూ... బెస్ట్ ప్రాక్టీస్ కార్యక్రమాల ద్వారా విద్య బోధన చేస్తున్న ఉపాధ్యాయులు సాయిరాణిని అభినందిస్తూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులతో ప్రైవేటు పాఠశాల విద్యార్థులను పోల్చి ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల తెలివితేటలను వారి తల్లిదండ్రుల ముందు ప్రదర్శించాలి పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే వారికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల సహకారం ఉండాలన్నారు.
అలాగే చదువురాని తల్లులకు వారి పిల్లలు రోజుకు ఒక అక్షరం చొప్పున నేర్పించాలని అలా ఆ పిల్లలు పదవ తరగతి వచ్చేవరకు వారి తల్లులు కూడా పదవ తరగతి రావాలి అలా పిల్లలకు తల్లులకు మధ్య పోటీ ఏర్పడి అందరూ బాగా చదువుతారని తల్లుల చదువుకు కావలసిన సామాగ్రి ప్రభుత్వం సమకూరుస్తుందని ఓపెన్ టెన్త్ ద్వారా పరీక్షలు రాపిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కడం మండల ఎంఈఓ షేక్ హుస్సేన్, జిల్లా విద్యాశాఖ సమన్వయ కర్త లింబాద్రి, మద్దిపడగ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పోషకులు పాల్గొన్నారు.