calender_icon.png 9 September, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి పర్యటన ఖరారు

09-09-2025 12:44:19 AM

నిర్మల్ , సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు పర్యటన ఖరారు అయినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ నెల 10 11 తేదీల్లో నిర్మల్ అదిలాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించనున్నారని ఆమె పేర్కొన్నారు.

నిర్మల్ జిల్లా బాసరకు చేరుకున్న మంత్రి అక్కడ వరదల వల్ల నష్టపోయిన బాధితులను రైతులను ఆదుకొని త్రిబుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడతారన్నారు మధ్యాహ్నం నిర్మల్ చేరుకొని కాంగ్రెస్ పార్టీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో వరద నష్టం పై అధికారులతో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు.11న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో మంత్రి పర్యటిస్తారని పేర్కొన్నారు