09-09-2025 12:45:31 AM
బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 8 (విజయక్రాంతి); గత పదేళ్లుగా లేని యూరియా కొరత కాంగ్రెస్ అసమర్ధ పాలనతోనే ఏర్పడిందని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజక వర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహ రావు ప్రశ్నించారు.ఈ మేరకు సోమవారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ యూరియా విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య మాటల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఇప్పటికీ జిల్లాల్లో యూ రియా కొరత అలాగే ఉందనీ ఇంకా సిరిసిల్ల జిల్లాలో ఆరువేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేది ఉందన్నారు. వేములవాడలో కో- ఆపరేటివ్ సొసైటీ పరిధిలోనీ రైతులకు బి.ఆర్.ఎస్ నాయకులు అండగా ఉంటే ఎనమిదీ మంది బి.ఆర్.ఎస్ నాయకుల పై కేసు పెట్టడం ఏంటి అని మండిపడ్డారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తంలో యూరియా కొరత సిరిసిల్ల జిల్లా లోనే అధికంగా ఉందని ఆరోపించారు.
రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు అవగాహన లేదని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న సమ్మక్క- సారక్క జాతరకు ముందు ఆలయాన్ని మూసివేసి భక్తులను ఇబ్బందులకు గురి చేయడ మే కాకుండా ఆలయం పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న సుమారు ఐదు వేల మంది ఉ పాధి కోల్పోనున్నారని, ఇప్పటికైనా అందరి సలహాలు సూచనలు తీసుకొని,ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అభివృద్ధి కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.
మూ లవాగుపై అసంపూర్తిగా నిర్మాణమై ఉన్న వంతెన నిర్మాణం పూర్తికాకుండానే రోడ్డు విస్తరణ పనులు చేయడం సరైంది కాదని అన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ శీనన్న నాయకులు. ఏనుగు మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రాజు. మాజీ వేములవాడ సర్పంచ్ న రేందర్. కౌన్సిలర్. నిమ్మచెట్టి విజయ్. మాజీ సర్పంచులు. ఎంపీటీసీలు. తదితరులు పాల్గొన్నారు.