15-09-2025 04:50:34 PM
విజ్ఞానాభివృద్ధికి పునాది గురువులే..
ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి.. బట్టు కెవల్ పంత్..
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని రామాపురం గ్రామంలోని అంబేద్కర్ కాలనిలో గల ప్రాధమిక పాఠశాల నందు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు మైత్రి ఫౌండేషన్(Mythri Foundation) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకున్నారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బట్టు కెవల్ పంత్ మాట్లాడుతూ.. విద్యతోనే ప్రతి ఒక్కరు రాణించటం జరుగుతుందని, విద్య నేర్పిన గురువును, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నటికీ మరవకూడదని తెలియజేశారు. కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాయబారపు వెంకటరమణ, ప్రధానోపాధ్యాయురాలు అందె భవాని, మీసాల లింగయ్య, ప్రాధమిక పాఠశాల ఎయంసి మాజీ చైర్మన్ నిదానపు సోమయ్య, ఫౌండేషన్ కోశాధికారి అంజి, కార్యదర్శి బెల్లంకొండ నరేష్,ప్రచార కార్యదర్శి షేక్ మీరా, సభ్యులు బసవయ్య, కోత్తపల్లి రాము, ఆరె.విరేంద్ర కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు డి.రామ్మూర్తి, డి.విరబాబు, వి.స్వాతి.యం.శాంతి పాల్గొన్నారు.