calender_icon.png 10 July, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలేకరులపై అక్రమ కేసులు

09-07-2025 10:47:13 PM

ఖండించిన జర్నలిస్టు సంఘాలు..

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తున్న విలేకరులపై కేసులు నమోదు చేయడాన్నీ జర్నలిస్టు సంఘాలు వేరువేరుగా ఖండించాయి. అధికారుల పనితీరును ఉన్నతాధికారులకు తెలియజేస్తూ కథనాలు ప్రచురిస్తే కొంతమంది అధికారులు అది జీర్ణించుకోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. గతంలో కూడా జిల్లాలో అధికారుల పనితీరుపై వార్తలు రాసిన నేపథ్యంలో ఆ రిపోర్టర్లపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇదే ఆనవాయితీగా కొంతమంది అధికారులు తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకరులపై వ్యక్తిగతంగా కేసులునమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అధికారుల తీరు మారకపోతే రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్, కంది మధుసూదన్, వెంకటస్వామి, మధు, టీయూడబ్ల్యూజే (143) జిల్లా నాయకులు రేణికుంట్ల శ్రీనివాస్ లు కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు. టియూడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి, డబ్ల్యూజెఐ జిల్లా అధ్యక్షులు పార్వతి సురేష్ కుమార్ లు వేరువేరు ప్రకటనలలో ఖండించారు. జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తే ఉపేక్షించేది లేదన్నారు.