29-11-2025 12:42:08 AM
ఎవరికీ తలవంచం.. దేశ రక్షణ విషయంలో రాజీలేదు
-దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచం
-శాంతి స్థాపనకు దురాగతాలను అణచివేస్తాం
-‘మన మిషన్’ శత్రువులను నాశనం చేస్తుంది
-ఉడుపిలో లక్ష కంఠ భగద్గీత పఠనంలో ప్రధాని మోదీ
-భగవద్గీత శ్లోకాలు పారాయణం
-గోవాలో ప్రపంచంలోనే ఎత్తున రాముడి విగ్రహం ఆవిష్కరణ
బెంగళూరు, నవంబర్ 28 : ‘ నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు భయపడదు.. ఎవరి ముందు తలొగ్గదు.. దేశ రక్షణ విషయంలో రాజీలేదు.. అందుకు ఎంత దూరమైనా వెళ్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిం దూర్‌లో మన సంకల్పాన్ని ప్రపంచం చూ సింది. ‘మన మిషన్’ సుదర్శన చక్రం శత్రువులను నాశనం చేస్తుంది. అని మోదీ స్పష్టం చేశారు.
కర్ణాటకలోని ఉడుపిలో శుక్రవారం మోదీ పర్యటించారు. అక్కడ ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొని గీతా పారాయణం చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. గీతలోని శ్రీ కృష్ణుడి బోధనలు మనకు జాతీయ విధానాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని అందులో శ్రీ కృష్ణుడు బోధించాడని తెలిపారు.
సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్, సర్వజన్ హితయ అనే నినాదాలు గీత నుంచి స్ఫూర్తి పొందినవవేనని ప్రధాని తెలిపారు. గతంలో ఉగ్రదా డులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయకుండా చూస్తుండిపోయాయని విమర్శించారు. కానీ, నయా భారత్ అలా కాదని ప్రధాని స్పష్టం చేశారు. శాంతి స్థాపనకు అవసరమైతే దురాగతాలకు పాల్పడే వారిని అణచివేయాలని గీత మనకు బోధిస్తుందని తెలిపారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందు లో భాగంగానే రాబోయే రోజుల్లో దేశంలో ని ముఖ్యమైన ప్రాంతాల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా పూర్తిస్థాయి సురక్షా కవచం ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఉడుపి కర్మభూమి
ఉడుపి జనసంఘ్, భారతీయ జనతా పార్టీకి సుపరిపాలన నమూనాకు కర్మభూమి అని ప్రధాని పేర్కొన్నారు. ఉడుపి రావడం తనకు చాలా ప్రత్యేకమైందన్నారు. అంతకుముందు ప్రధాని భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా నుంచి ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలను ప్రధాని పఠించారు. ఆయనతోపాటు లక్ష మంది భక్తులు, గాయకులు ఏకకాలంలో ఈ శ్లోకాలను పఠించారు. మధ్వసరోవరంలో తీర్థ ప్రోక్షణ అనంతరం ఆలయంలో కనకన కిండి (కిటికీ/కంత) నుంచి శ్రీకృష్ణుడిని మోదీ దర్శించుకున్నారు.
అష్టమఠాలకు నేతృత్వం వహిస్తున్న పీఠాధిపతుల ఆశీర్వచనం అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. జగద్గురు సుగుణేంద్ర తీర్థ స్వామీజీ విశ్వగీత పర్యాయ ప్రధాని మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1968లో ఉడుపి ప్రజలు జనసంఘ్ నుంచి వీఎస్.ఆ చార్యను మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ఉడుపిలో కొత్త పాలన కు ప్రజలు పునాది వేశారని తెలిపారు.
77 అడుగుల రాముడి విగ్రహం ఆవిష్కరణ
సౌత్ గోవా కానాకోనలోని గోకర్ణ జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తునదని పేర్కొన్నారు. మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుక కార్యక్రమం జరగింది. ఈ సందర్భంగా ప్రధాని మఠాన్ని సందర్శించారు.