calender_icon.png 11 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్

11-09-2025 12:04:08 AM

  1. ఈ ఫార్ములా కాదు రైతులకు యూరియా ఫార్ములా చెప్పాలి 

గ్రూప్ ప్రభుత్వ పనితీరు తేటతెల్లం                         

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి   

సూర్యాపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిషన్ల పేరు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులకు ఈ ఫార్ములా కాదు యూరియా ఫార్ములా చెప్పాలని డిమండ్ చేశారు.

హైకోర్ట్టు తీర్పుతో గ్రూప్ ఫార్ములా ఏందో తేలిపోయిందన్నారు. కరెంట్, కాళేశ్వరం మీద కమిషన్‌లు, ట్యాపింగ్ కేసు ప్రతిదీ అబద్ధమని తేలిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఏ ప్రభుత్వమైనా బాధ్యతతో కొనసాగించాలన్నారు.  గ్రూప్1 విషయంలో డ్రామాలన్నీ బయటపడ్డాయన్నారు.

ఈ ప్రభుత్వం మీడియాలో స్పేస్ ఆక్యుఫై తప్ప.. ప్రజల మనసుల్లో స్పేస్ ఆక్యుఫై చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు పడుతున్న ఇబ్బందులతో ఎట్లా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నామన్నారు.  కాలేశ్వరాన్ని సీబీఐకి అప్పగించడంతోనే మోదీతో రేవంత్‌రెడ్డి బంధం బహిరంగమైందన్నారు.