calender_icon.png 18 October, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపాల వెలుగుల్లో దివ్యంగా దీపావళి వేడుకలు

18-10-2025 12:00:00 AM

మాస్టర్ మైండ్స్ మొకిలా బ్రాంచ్‌లో ఘనంగా పండుగ

శంకర్ పల్లి అక్టోబర్ 17: తమ సోమా జ్యోతిర్గమయ అనే శ్లోకం నిజంగా జీవరాహిత్యానికి వెలుగును నింపే దీపావళి పండుగలో ప్రాముఖ్యతను వివరిస్తుంది. అలాంటి పండుగను మాస్టర్ మైండ్స్ మొకిలా బ్రాంచ్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ముందస్తు దీపావళి కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్  రవి యాదవ్  ముఖ్య అతిథిగా హాజరై, పిల్లలతో కలిసి దీపాల వెలుగుల్లో ఆనందం పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,దీపావళి అంటే కేవలం రాకెట్లు కాల్చడం కాదు, అది చీకటిని తొలగించి మన జీవితంలో జ్ఞానాన్ని, నైతిక విలువలను నింపే ఓ అద్భుతమైన పర్వదినం. విద్యార్థుల్లో ఈ సందేశం వెళ్ళాలి అన్నారు. పిల్లలు సంప్రదాయ వేషధారణలో పాల్గొన్న ఈ వేడుకలో లక్ష్మీదేవి పూజ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు సాంప్రదాయబద్ధంగా పూజలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో మంత్రోచ్చారణల నడుమ దేవిని పూజించారు.

అనంతరం పిల్లలు కాకరపువ్వొతులు, చిచ్చుబుడ్డులు, భూచక్కరాలు వంటి పటాకులతో ఆడుతూ పాడుతూ దీపావళి సందడిని పెంచారు. విద్యార్థుల హర్షాతిరేకంతో సాగిన ఈ వేడుకలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ మరియు డైరెక్టర్ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలలో జరిపిన ఈ పండుగ వేడుకలు విద్యార్థుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా ఏర్పడ్డాయి.