17-10-2025 10:54:48 PM
డివిజన్ అధ్యక్షులు పాండు
మహబూబ్ నగర్ టౌన్: అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా చేస్తూ చేసిన సేవలు ఎల్లప్పుడూ పదిలంగా ఉండాలే పని చేయాలని డివిజన్ అధ్యక్షులు పాండు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వెంకటేశ్వర కాలనీ లోగల క 1104యూనియన్ రూరల్ సబడివిజన్ ఎలక్షన్స్ 1 మహబూబ్ నగర్ డివిజన్ నాయకత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం నిర్వహించారు.
ఈ ఎలక్షన్ లో సబ్ డివిజన్ అధ్యక్షులు గా బాలరాజ్, హన్వాడ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలరాజ్, సెక్రటరీ గాఅశో,సెక్షన్ లీడర్లు గా ఇర్షాద్, హన్వాడ జనార్దన్, కోయిల్ కొండ సత్యనారాయణ, మహమాదాబాద్ హన్మంతు, గండీడ్ నెహ్రు, వీరందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరూ ఐక్యంగా ఉండి ముందుకు సాగుదామని తెలిపారు. సమస్య ఎవరికి వచ్చిన తమ సమస్యగా భావించి పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి యాదయ్య గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శేఖర్, అదనపు కార్యదర్శి ఎస్ రామరాజు, డిస్కమ్ నాయకులు సత్యం రూరల్ సబ్ డివిజన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.