13-07-2025 12:19:40 AM
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
హైదరాబాద్, జూలై 12: పంజాబ్ నేష నల్ బ్యాంక్ శనివారం రోజు నల్గొండ జిల్లా హలియాలో తమ బ్రాంచ్‌ను ప్రారంభిం చింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమశివం, హై దరాబాద్ జోనల్ హెడ్ (సీజీఎం) సునీల్ కుమార్ చుగ్, హైదరాబాద్ సర్కిల్ హెడ్ అ రవింద్ కల్రా ముఖ్యఅతిథులుగా పాల్గొ న్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తోంది.
నిర్వహించిన ఔట్రీచ్ కార్యక్రమంలో, స్వయం సహాయక బృం దాలు, రైస్ మిల్ ఫైనాన్సింగ్, కిసాన్ క్రెడిట్ కార్డులు, అగ్రి గోల్డ్ రుణాలు మొదలైన వివిధ వ్యవసాయ- ఫైనాన్సింగ్ పథకాల కింద రూ.60 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమ శివం మాట్లాడుతూ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రజలతో నేరుగా మమేకం కావ డానికి, వారి ఆర్థిక అవసరాలను అర్థం చేసు కోవడం కోసమే ఈ ఔట్రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కమ్యూ నిటీ సంక్షేమ చొరవలో భాగంగా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారు.