calender_icon.png 27 July, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలి

26-07-2025 08:09:41 PM

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు

జాజిరెడ్డిగూడెం: ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీటిని తక్షణమే విడుదల చేసి సూర్యాపేట జిల్లాకు 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇవ్వాలని,అసంపూర్తిగా ఉన్న ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మత్తులు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు అన్నారు. మండల కేంద్రం అర్వపల్లిలో శనివారం ఆపార్టీ మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్కు గాను రైతులు నార్లు పోసుకుని నాటు పెట్టడం కోసం సిద్ధంగా ఉన్న సమయంలో సరైన వర్షాలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నందున తక్షణమే ఎస్సారెస్పీ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు కావలసిన ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచాలని, కల్తీ ఎరువులు, పురుగు మందులను నివారించి ఎరువుల కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.