13-08-2025 12:00:00 AM
కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): రోడ్లు, ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారం చేయరాదని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. మంగళవారం ఆయన నగరంలో పర్యటించారు. నగరంలోని రాజీవ్ చౌక్, శనివారం మార్కెట్ ను సందర్శించి పారిశుధ్య పనులు, ఫుట్ పాత్ రోడ్డు ఆక్రమణలను తనిఖీ చేసి పరిశీలించారు. ఎంక్రోజ్ మెంట్స్, పారిశుధ్య పనుల పై అధికారులకు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులను మెరుగ్గా చేయాలన్నారు. గార్బెజ్ పాయిట్ల వద్ద రోడ్ల పై చెత్త పడకుండ పారిశుధ్య అధికారులు, సిబ్బంది చర్యలు తీస్కోవాలని అన్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడ అపరిశుభ్రత అగుపించకూడదని ఆదేశించారు.
రోడ్లను, ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారం చేసే వారికి జరిమాన విధించాలన్నారు. ఎక్కడ ఎంక్రోజ్ మెంట్స్ ఉన్న తక్షణ మే తొలగించేలా చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వేణు మాధవ్, పారిశుధ్య, డిఆర్ సిసి, టౌన్ ప్లానింగ్ అధికారులుపాల్గొన్నారు.