13-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 ,(విజయక్రాంతి):జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల క లిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమా వేశ మందిరము లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించా రు.
జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం, నియంత్రణ చర్యలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలుచేయాలనిసూచించారు.
జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలి గే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అం దించేలా చర్యలు తీసుకోవాలనీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి రోహిత్ రాజ్ ,జడ్ పి సి ఈ ఓ నాగలక్ష్మి,ఇంటర్మీడిట్ అధికారి వేంకటేశ్వరరావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, ర వాణా శాఖ అధికారి వెంకటరమణ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మరియు సంబంధిత శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.