17-09-2025 06:21:42 PM
బోథ్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఆశా పథకంలోని టీడీపీఎస్ విధానాన్ని ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేయవద్దని బోథ్ మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటిలు పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం జిల్లా పత్తి రైతాంగంపై శరగఘాతం విధించిందని, దీనివల్ల పత్తి రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారని, వ్యవసాయం దెబ్బతింటుందన్నారు. పత్తి దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం అంటే దేశీయ పత్తికి గిరాకీ లేకుండా చేయడమేనని విమర్శించారు. జిల్లాలో పీఎం ఆశా పథకం అమలు చేస్తే వెనుకబడిన జిల్లాలో పంట రిజిస్ట్రేషన్, పారదర్శక వేలం, ప్రత్యక్ష చెల్లింపులు సాధ్యం కాక రైతుల నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికాకు తలొగ్గి పత్తిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వం, ప్రస్తుతం సీజన్లో అధికంగా సాగుతున్న మక్కా (మొక్కజొన్న) దిగుమతులను కూడా చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.