calender_icon.png 12 July, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిని చూడకండి.. కారును చూడండి

12-07-2025 01:27:54 AM

హన్వాడ మండల కార్యకర్తలతో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ జూలై 11 (విజయ క్రాంతి) : జరగబోయే ఎన్నికల్లోనైనా వ్యక్తిని చూడకూడదని కారు గుర్తును మాత్రమే చూడాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలకు సూ చించారు. శుక్రవారం హన్వాడ మండల కేంద్రంలో మండల లోని వివిధ గ్రామాలకు చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి సేవ చే యడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మేము వస్తాం తర్వాత మీ సంగతి చూస్తాం అనే భాష ఎక్కడ వాడకూడదని బిఆర్‌ఎస్ లో ఉన్న ఏ కార్యకర్త కూడా అలా మాట్లాడాలని తెలిపా రు. మన నియోజకవర్గంలో రూ 30 కోట్ల మిగులు బడ్జెట్ మనం ఇవ్వడం జరిగిందని, ఆ డబ్బులతోనే ఇప్పుడు రోడ్లు వేస్తున్నారని తెలిపారు.

తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చని, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా అందరం ముందుకు సాగుదామని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండు ఏకమై ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఎన్నిక ఏదైనా బిఆర్‌ఎస్ విజయమే మన ధ్యేయంగా ముందుకు సాగాలని తెలిపారు. గడిచిన 10 ఏళ్లు కేవలం అభివృద్ధి మీద ధ్యాస ఉంచి ముందుకు సాగడం జరిగిందన్నారు.

రియల్ ఎ స్టేట్ పూర్తిగా పడిపోయిందని, మళ్లీ ఎప్పుడు బి ఆర్ ఎస్ వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. అందరం సమిష్టిగా ఉండి ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో బిఆర్‌ఎస్ నేతలు కరుణాకర్ గౌడ్, జంబులయ్య, గంజి వెంకన్న, లక్ష్మయ్య, వెంకటయ్య, జిల్లెల తేజ వర్ధన్ తదితర ముఖ్య నేతలు ఉన్నారు.