calender_icon.png 12 July, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగం ఏదైనా ప్రావీణ్యత ఉండాలి

12-07-2025 01:29:37 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ జూలై 11 (విజయ క్రాంతి) : ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుందని అది బయటికి తీసినప్పుడే వారు ఏదో ఒక రంగంలో ప్రావీణ్యత కనబరుచుతారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల చదరంగం బోర్డు లను పంపిణీ చేసే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ బోర్డ్ లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అవకాశం ఉంటే విద్యార్థులకు చెస్ క్రీడలో శిక్షణ తరగతులను నిర్వహించడంతో పాటు పోటీలు నిర్వహించాలని ఫోరం సభ్యులకు సూచించారు.

ఎన్‌ఆర్‌ఐ ఫోరం సభ్యులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులలో చదరంగం ఆట మీద ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. అంతకుముందు గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలో రజక సంఘ భవనం అసంపూర్తిగా నిర్మించడం జరిగిందని గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే రూ 5 లక్షల మంజూరు చేశారు.

ఈ సందర్భంగా రజక సంఘం నేతలు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఎన్‌ఆర్‌ఐ ఫోరం కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి, శ్రీధర్, రాఘవేంద్ర, వెంకటేష్ , రజక సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.