25-11-2025 12:20:09 AM
హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ పాన్-ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పూరిసేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని జేబీ మోషన్ పిక్చర్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై జేబీ నారాయణరావు కొండ్రోల్లా, పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా టబు, దునియా విజయ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.
తాజాగా ఈ ప్రాజెక్టు షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మి కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్‌కు సంబంధించిన ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. అర్జున్‌రెడ్డి, యానిమల్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నందున ఈ సిమిమా టైటిల్, ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను త్వరలో రిలీజ్ కానుంది.