09-08-2024 02:34:37 AM
నాగర్‌కర్నూల్. ఆగస్టు 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో హెల్త్ మాఫి యా చెలరేగిపోతోంది. కాసుల కక్కుర్తితో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు, వైద్యు లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. చట్టవ్యతిరేకంగా లింగనిర్దారణ పరీక్షలు చేయ డం తోపాటు వచ్చీరాని వైద్యంతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. రోగం నయంచేసి పునర్జన్మ ప్రసాదిస్తారని హాస్పిటల్‌కు వెళ్తే ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయినా ప్రాణం దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. సంపాదనే లక్ష్యంగా వచ్చీరాని వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలకు ఎసరు తెస్తున్న ఇలాంటి దవాఖానలకు కొందరు పొలిటికల్, వ్యాపార, జర్నలిజం ముపుగుతో బాడీగార్డులుగా వ్యవహరించడం గమనార్హం.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతోపాటు ఈ ప్రాం తంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో నూతన హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నిబంధనలను పాటించకుండానే అడ్డగోలుగా అనుమతులు పొంది న యాజమాన్యాలు వాటిని కాపాడుకునేందుకు తెరవెనుక బాడీగార్డులను పెట్టుకుం టున్నట్టు విమర్షలున్నాయి. దీంతో ప్రసవం కోసం వెళ్లే గర్భిణులను వారి వెంట వెళ్లే బంధువులను భయబ్రాంతులకు గురిచేసి నార్మల్ డెలివరీ అవకాశం ఉన్నా సిజేరియ న్లు చేసి లక్షలు వసూలు చేస్తున్న దుస్థితి. ఇతర వ్యాపకాలున్న కొందరు వైద్యులు ఎక్కడో ఉండీ.. సిబ్బందితో వీడియో కాల్ ద్వారా వైద్యం చేయిస్తూ ప్రజలను బలిగొంటున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి.
మరికొన్ని హాస్పిటల్స్ డబ్బులకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిల్ల అని తెలిస్తే అబార్ష న్లు కూడా చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగుచూశాయి. సంబంధిత అధికారులకు తెలిసి కూడా చర్యలు తీసుకునే సాహసం చేయకపోవడంతో హెల్త్ మాఫియా చెలరేగిపో తోంది.
ముఖ్యంగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు కూడా స్థాయికి మించిన వైద్యం చేస్తూ అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో పాటు జిల్లాలోని ఆయా ఆసుపత్రులలో అర్హతలేని వారే డయాగ్నోస్టిక్ సెంటర్లను నడుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా జిల్లాకు బదిలీపై వచ్చిన వైద్యాధికారిణి స్వరాజలక్ష్మి ప్రత్యేదృష్టి సారించి ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలను, మాతాశిశు మరణాలను నిలువరిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
జిల్లాలో జరిగిన పలు ఘటనలు
మెరుగైన వైద్యం అందించేలా చూస్తాం
నేను జిల్లాకు వచ్చి నాలుగు రోజులు మాత్రమే అవుతోంది. ఇప్పటివరకు సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశాల్లో పాల్గొన్నాం. ఇటీవల ఓ బాలింత మృతిచెందడం బాధాకరం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అర్హ త లేకున్నా స్థాయికి మించిన వైద్యం చేయడం సరికాదు. వాటిపై కఠినంగా వ్యవహరిస్తం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే హాస్పిటల్స్‌పై నిఘా పెట్టాం. అలాం టి దవాఖానల గురించి తెలిస్తే మాకు ఫిర్యాదు చేయవచ్చు.
స్వరాజ లక్ష్మి,
జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్