calender_icon.png 22 January, 2026 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపూర్ గురుకుల పాఠశాలలో కలకలం

09-08-2024 10:50:58 AM

పెద్దాపూర్ : జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఒకరిని మెట్ పల్లిలో మరొకరికి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థిని ఆర్డీవో శ్రీనివాస్ పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్డీవో సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన అనిరుద్ గా గుర్తించారు.