calender_icon.png 4 August, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో ఘనంగా స్నేహితుల దినోత్సవం

04-08-2025 12:00:00 AM

కొత్తపల్లి, ఆగస్టు 3 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో స్నేహితు ల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరైఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదకు ఆపన్న హస్తంగా స్నేహితులు ఉంటారని, అభివృద్ధికి చేయూతనిచ్చేది స్నేహితులను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

నేటి పోటీ ప్రపంచంలో సమయభావం వలన చాలామంది స్నేహితులకు దూరమవుతు న్నారని వారితో సంప్రదింపులను సైతం ఏ రూపంలో కూడా జరపకపోవడం అత్యంత విచారకరమన్నారు. ప్రతి ఒక్కరూ సమయాన్ని కేటాయించి స్నేహానికి మద్దతు తెలిపాలని స్నేహాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు.

వేడుకలలో భాగంగా ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డికి ఫ్రెండ్షిప్ రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలియజేసి వారి యొక్క సహకారాన్ని అభివృద్ధికి అందించి ఆశీర్వదించాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.