calender_icon.png 8 July, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారోగ్యంలో డాక్టర్లది నిస్వార్థ సేవ

07-07-2025 12:00:00 AM

  1. సమాజ సేవలో వైద్యుల నిబద్దత మరువలేం

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన

హైదరాబాద్, జూన్6,(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో డాక్టర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ అధిపతి ధారాసింగ్ నాయక్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం( డాక్టర్స్ డే) సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని ఉన్న డాక్టర్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా ఈ మూడు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ప్రజా సేవలో ఉన్న డాక్టర్లను సన్మానించే  కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపిది. ఈ వేడుకల్లో  హైదరాబాద్ జోనల్ ఆఫీసు ఉన్నతాధికారి ధారాసింగ్ నాయక్, అలాగే జోన్ పరిధిలో ఉన్న ఏడు ప్రాంతీయ ఆఫీసుల్లో సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లోని వివిధ ఆస్పపత్రులు సందర్శించారని పేర్కొన్నది.

ఈ సందర్భంగా రోగులకు సేవ చేస్తున్న వైద్యులను సత్కరించామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో డాక్టర్లు చేస్తున్న నిస్వార్థ కృషిని ఆ సంస్థ ప్రశంసించింది. సమాజం కోసం సేవ చేస్తున్న డాక్టర్ల నిబద్దత మరువలేనిదని పేర్కొన్నది.