04-07-2025 08:13:22 PM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు,జూలై4(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,ఉద్యమ కారుడు తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి పురస్కరించుకొని జిల్లా సంక్షేమ భవన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో శ్రీదొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కొమురయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం, తెలంగాణ సాయుధ పోరాటానికి మహోన్నత ఉద్యమానికి ఆద్యుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు.