calender_icon.png 13 September, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లిఫ్ట్ వర్కర్స్‌ను తొలగించొద్దు’

16-12-2024 01:38:08 AM

హుజుర్‌నగర్, డిసెంబర్ 15: లిఫ్ట్ వర్కర్స్‌ను తొలగించడం అన్యాయమని లిఫ్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రసాద్ అన్నారు. హుజూర్‌నగర్‌లోని ఐఎఫ్‌టీయూ శ్రామిక భవన్‌లో ఆదివారం లిఫ్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయ న మాట్లాడారు. జిల్లాలో సాగర్ ఎడమకాలువ కింద 42 లిఫ్ట్‌లు, పులిచింతల ప్రాజెక్టు కింద 17 లిఫ్టులు ఉండగా సుమా రు 150 మంది కార్మికులు గత 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలను చేపట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు ప్రాజెక్టుల కింద ఉన్న లిఫ్టులను స్వాధీనం చేసుకుని ఏజేన్సీ ద్వారా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమిస్తుందని తెలి పారు. గతంలో పని చేస్తున్న కార్మికులను కాదని, హుజూర్‌నగర్ కేంద్రంగా ఇతరులకు నియామక పత్రాలను అందజేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ గుర్తింపు రద్దు చేసి, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.