16-12-2024 01:37:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాం తి): ఏ క్షణంలోనైనా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కావొచ్చనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది. ఈ- ఫార్ములా, ఫోన్ ట్యాపింగ్, లగచర్లలో అధికారులపై దాడి వంటి ఏ కేసులోనైనా కేటీఆ ర్‌ను పోలీసులు అరెస్ట్ చేయవచ్చని పార్టీ భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో ‘ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలి ?’ అన్న అంశాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారని తెలిసింది. దీనిలో భాగంగా గులాబీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దించి, ప్రణాళికలు అమలు చేస్తున్నారని, పార్టీ సీనియర్ నేతలను సైతం భాగస్వాములను చేస్తున్నట్లు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచేం దుకే కుట్రలు పన్నుతున్నారని ప్రచారం చేసేందుకు గులాబీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా సినీస్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, అరెస్ట్‌పై ‘తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా చట్టం వదిలిపెట్టదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం తో ఇక తర్వాయి కేటీఆర్ అరెస్టేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నట్లు తెలిసింది.
ఇప్పటికే పోలీస్ వర్గాలు ఉప్పందించాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. దీని లో భాగంగానే హైదరాబాద్‌లోని నందినగర్‌లోని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి భారీగా గులాబీ శ్రేణులు తరలివస్తున్నారు.
సాంస్కృతిక బృందాలతో కలిసి..
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఉద్యమ తరహాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఊరూరా సభలు, సమావేశాల్లో నిర్వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కళాకారులతో సాంస్కృతిక బృందా లు ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు జరిగితే, ఆ అరెస్ట్ ను సైతం తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేటీఆర్ ఎన్ని రోజులు జైల్లో ఉంటే, అన్ని రోజులూ అవిశ్రాంతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలిసింది. ప్రజల మధ్య కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. గులాబీ శ్రేణులపై కేసు లు బనాయిస్తే, వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ న్యాయవిభాగానికి ఏకంగా రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ ఇంటికి క్యాడర్..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదనే బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని నంది నగర్‌లోని ఆయన నివాసానికి వివిధ జిల్లా ల నుంచి భారీగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తమ అనుచరులతో కలిసి వస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చోపచర్చలు చేస్తు న్నారు. కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్ నాయకులు అస్త్రశస్త్రాల ను సిద్ధం చేసుకుంటున్నారు.
గ్యారెంటీల అమలు వైఫల్యంపై సభలు..
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రచారం చేసేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఊరూరా సభలు, సమావేశాలు నిర్వహించనున్నాయి. అలాగే రైతు భరోసా, రైతుబీమా ఎగనా మం పెట్టిందని, ఆడపిల్లల పెండ్లికి తు లం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500, పింఛన్లు పెంచలేదనే అంశాల ను ప్రధానంగా లేవనెత్తనున్నాయి.
రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక సాప్ట్‌వేర్ కంపెనీనైనా తీసుకురాలేదని ప్రచారం చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్ల తొలగింపు విషయాన్ని ప్రధానం గా తెరపైకి తీసుకురానున్నట్లు తెలిసింది. లగచర్ల ఫార్మాసిటీ, ముఖ్యమంత్రి సోదరుల ఆగడాలు, గిరిజను లపై అక్రమ కేసులు, అరెస్ట్ అంశాలను ప్రధానంగా బీఆర్‌ఎస్ ఎత్తుకోనున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా త్వరలోనే పార్టీ గ్రామ కమిటీలు వేయనున్నట్లు తెలిసింది.