calender_icon.png 30 October, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

30-10-2025 12:18:26 AM

ఎస్పీ రాజేష్‌చంద్ర

కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  అన్నారు. పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పోలీస్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. కామారెడ్డిలో రక్తదాన శిబిరాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర ప్రారంభించారు. ఎల్లారెడ్డి లో డిఎస్పి శ్రీనివాసరావు, బాన్సువాడ లో డిఎస్పి విట్టల్ రెడ్డి రక్త దాన శిబిరాలు ప్రారంభించారు.

జిల్లా వ్యాప్తంగా179 మంది మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ రాజేష్ చంద్ర రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తనతో పాటు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదాన శిబిరంలో  పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరం ద్వారా 195 యూనిట్ల రక్తం రెడ్‌క్రాస్ సొసైటీకి  అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసరావు, విట్టల్ రెడ్డి, సీఐలు నరహరి, సంపత్ కుమార్, సంతోష్ కుమార్, అశోక్, ఎస్త్స్రలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ రాజన్న, విద్యార్థులు, కళాశాలల యజమాన్యాలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.