calender_icon.png 1 November, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం ప్రాణదానంతో సమానం

31-10-2025 12:00:00 AM

ఎస్పీ డా.శబరీష్ పి.

ములుగు, అక్టోబరు30 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా, ములుగు జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి ఆదేశాల మేరకు గురువారం రోజున ములుగు డిఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్లో ములుగు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది.జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూరక్తదానం అనేది ప్రాణదానంతో సమానం.

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుంది. పోలీస్ అమరవీరుల స్మరణోత్సవాల సందర్భంగా యువత, ప్రజలు, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది ఇలా సుమారు 500 మంది స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.అలాగే, విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరవదని, వారి స్మృతికి గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తామని పేర్కొన్నారు.

పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షకులే కాకుండా, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం వలన ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు లేదా తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాణ రక్షణ లభిస్తుందని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 180 యూనిట్ల రక్తం సేకరించబడింది.