calender_icon.png 1 November, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అధైర్య పడొద్దు

31-10-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, అక్టోబర్ 30 (విజయక్రాంతి):  అకాల వర్షాల నేపథ్యంలో... అన్ని శాఖల అధికారులు గ్రామ,మండల,జిల్లా స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని... ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని.. జిల్లాలో ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. రఘునాథ్ పల్లి ఎన్ హెచ్ రోడ్ ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం పరిశీలించి..నీటి వరద నివారణకు తీసుకోవాలిసిన చర్యలను అధికారులకు తెలిపారు.

నంతరం నిడి గొండ గ్రామం లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి.. రైతులు అధైర్య పడవద్దని తెలిపారు. తేమ వచ్చిన ధాన్యాన్ని  వెంటనే  నిర్వాహకులు కొనుగోలు చేయాలనీ.. వాతావరణ దృష్ట్యా.. రైతులు కూడా  తేమ శాతం వచ్చాక నే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలాన్నారు. కొద్దిగా తడిసిన ధాన్యం అరబెట్టుకునేందుకు టార్ఫాలిన్ లను ఇచ్చి రైతులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం లో డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఆర్థివో, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.