calender_icon.png 26 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం

26-09-2025 12:52:56 AM

- ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

- వైద్య సదుపాయాల నిమిత్తం రూ.18 కోట్ల 76లక్షల 80వేలు మంజూరు

- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి సొంతం అయితేనే నిండు జీవితం తమ సొంతం అవుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ జన రల్ ఆసుపత్రి లో ఎన్నో సంవత్సరాలుగా అందుబాటులో లేని ఎంఆర్‌ఐ, క్యాథ్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏర్పాటు కోసం వైద్య సదుపాయాల నిమిత్తం రూ 18 కోట్ల 76 లక్షల80 వేలు మంజూరు కావడం జరిగిందని తెలిపారు.

గత 20 నెలలుగా విద్య పైన దృష్టి పెట్టామని, విద్య ఎంతో ప్రాధాన్యత రంగమని ప్రజల్లో అవగాహన కల్పించడంలో సఫలీకృతం కావడం జరిగింద న్నారు. ఇక నియోజకవర్గం లో వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రభు త్వ ఆసుపత్రి కి వచ్చే పేద ప్రజలకు నిజాయితీ తోటి, చిత్తశుద్ధి తోటి నాణ్యమైన వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎంపి శ్రీమతి డికె అరుణ గారితో కలిసి డిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సోమన్న ని కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరామని, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మూడు లక్షల జనాభా దాటిందని, నగరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీగా ఉందని దానివలన అన్ని రంగాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకుపోగా మహబూబ్ నగర్ నగరం లోని టిడి గుట్ట, తిమ్మసాన్ పల్లి, బోయపల్లి గేట్ రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలను 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఎంపి డీకే అరుణ కేంద్రమంత్రిని ఎప్పటికప్పుడు కలిసి ఫాలో అప్ చేస్తారని తెలిపారు. రాజకీయ నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గం లో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారుల పైన దౌర్జన్యం చేసినా, వారిపైన దుర్భాషలాడిన సహించేది లేదని, ఇది మన సంస్కృతి కాదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు పైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు.

శాంతి యుతంగా ఉన్న మహబూబ్ నగర్ నగరంలో శాంతికి విచ్ఛిన్నం కలిగించే వ్యక్తు లు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చట్టం తన పని తాను చేసుకోబోతుందని అన్నారు. ఇట్టి విషయం లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెనహర్, గంజి ఆంజనేయులు, సతీష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా, రాషెద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.