calender_icon.png 14 August, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

14-08-2025 06:19:58 PM

హాజరుకానున్న హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలో కృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 16న కాళోజి కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. రాంనగర్లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ... శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొంటున్నారని అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు.

మధ్యాహ్నము రెండు గంటలకు రాంనగర్ నుండి ర్యాలీ కళాకారులు యాదవ యువకిశోరాల చేత ప్రారంభమై కాళోజి కళాక్షేత్రంకు చేరుకుంటుందని అక్కడ గోపూజ, అనంతరము శ్రీకృష్ణుని భజనలతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, బండ ప్రకాష్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, హాజరవుతున్నట్లు తెలిపారు.