14-08-2025 06:24:40 PM
పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న నావంతు సహాయం చేస్తా..
కాంగ్రెస్ పార్టీ కన్నాయిగూడెం మండల ఇంచార్జి జాడి రాంబాబు..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులకు ఇంటర్నెట్ లేక విద్యార్థులు డిజిటల్ తరగతులకు ఇబ్బంది అవుతుందని పాఠశాల ఉపాధ్యాయులు దాతల సహాయం కావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కన్నాయిగూడెం మండల ఇంచార్జి జాడి రాంబాబు(Mandal Incharge Jadi Rambabu) తెలుసుకోని పాఠశాల విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తన సొంత ఖర్చులతో జియో వైపై కొనుగోలు చేసి పాఠశాల సిబ్బందికి బుట్టాయిగూడెం గ్రామస్థులతో కలిసి అందజేశారు.
ఈ సందర్బంగా జాడి రాంబాబు మాట్లాడుతూ, మన పాఠశాల కోసం మన విద్యార్థుల కోసం ఇంకా ఎటువంటి సహాయం చేస్తానని పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న నా వంతు తోచిన సహాయం చేయానికి సిద్ధం అని అన్నారు. అలాగే ఇంకా ఎటువంటి అవసరాలకు అయినా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దాతలుగా ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వివిధ గ్రామ సిబ్బంది పత్రిక విలేకరులు గ్రామ యువత గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.