14-08-2025 06:17:42 PM
బిజెపి మండల అధ్యక్షులు శంకర్ నాయక్..
మోతె: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని బిజెపి మండల అధ్యక్షుడు భూక్యా శంకర్ నాయక్(BJP Mandal President Bhukya Shankar Nayak) అన్నారు. గురువారం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం అయన మాట్లాడుతూ... ఆగస్టు 15 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు జాతీయ భావంతో ఉండాలని చాటి చెప్పేవిధంగా జాతి కులం మతం బేధాలు లేకుండా జాతీయ జెండాలు ఎగరావేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబెర్ బానోతు శ్రీను నాయక్, ఉప్పుల రాంచంద్రయ్య, మండల సెక్రెటరీ పెరుగు మధు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గుగులోతు సైదానాయక్, కొత్త ధర్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.