calender_icon.png 24 January, 2026 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతాజీ త్యాగాలను మరవద్దు

24-01-2026 12:00:46 AM

గరిడేపల్లి,జనవరి 23 : స్వాతంత్రం ఊరికే రాదు మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం తెచ్చి ఇస్తానని మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలను మరవద్దని బిఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్, మండల అధికార ప్రతినిధి రామ్ సైదులు అన్నారు.గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో శుక్రవారం ఆజాద్ హిందు పౌచ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల గుండెలలో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు భారత స్వా తంత్య్రం సంగ్రామంలో పోరాట పటిమను,దేశభక్తిని రగల్చిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ త్యాగాలను నేటి యువత స్మరించుకోవాలని అన్నారు.కార్యక్రమంలో రణపొంగు శ్రావణ్,రామ్ మధు, నకిరకంటి రమేష్,తక్కెళ్ళ నాగార్జున,నందిపాటి ఇసాక్, పోలంపల్లి అంజి, గద్దల నిత్యానందం, రామ్ సంపత్, కార్తీక్, సైదులు,శివ,సన్నీ పలువురు పాల్గొన్నారు

 ఘనంగా జయంతి వేడుకలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జనవరి 23:ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు,ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని మండల పరిధిలోని కొమ్మాల  జడ్పీహెచ్‌ఎస్ లో శుక్రవారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు శేఖర్ నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ నేటి విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను తెలుసుకొని,ఆయన చేసిన త్యాగాలను మరవకూడదని అన్నారు.చిన్నతనం నుంచే ప్రతి విద్యార్థిలో దేశభక్తి,నైతిక విలువలు పెంపొందించుకోవడం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంధ్యారాణి, హరీష్, మాధవి,స్నేహలత,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.