calender_icon.png 24 January, 2026 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజరూప దర్శనంలో జోగుళాంబ అమ్మవారు

24-01-2026 12:01:21 AM

భక్తజనసంద్రంగా మారిన అలంపూర్ క్షేత్రం 

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు 

అలంపూర్, జనవరి 23: గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ ఆలయంలో వార్షిక బ్రహ్మో త్సవాలలో భాగంగా శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారు నిజరూప దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యా లు, పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేశారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

మరోవైపు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భా గంగా జోగులాంబ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కలశాలతో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ,ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరిత ,డిసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీను,మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప ,తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో దీప్తి అన్ని ఏర్పాట్లు చేశారు.