calender_icon.png 18 September, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య సమస్యలు రావొద్దు

18-09-2025 10:24:48 PM

సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా..

ఎల్బీనగర్: సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య సమస్యలు రావొద్దని శానిటేషన్ జవాన్లు, శానిటేషన్ సిబ్బంది, స్వేచ్ఛ ఆటో కార్మికులను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్(Deputy Commissioner Srinivas) ఆదేశించారు. ప్రజలకు పారిశుద్ధ్య విభాగం ద్వారా మెరుగైన సేవలు అందించడంలో భాగంగా చైతన్యపురిలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగానికి సంబంధించిన జవాన్లు ఎస్ఎఫ్ఏలు, స్వచ్ఛ ఆటోల వారితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ... స్వచ్ఛ ఆటో సిబ్బంది ఇండ్లు, వ్యాపార స్థలాల నుంచి చెత్తను రోజు సేకరించి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.

ఎస్ఎఫ్ఏలు, జవాన్లు ప్రతి రోజూ మానిటర్ చేసి, సక్రమంగా పని చేయనివారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ విషయంలో వచ్చే ఆన్ లైన్, ఇతర ఫిర్యాదులను 24 గంటల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని జీవీపీలు, రాంకీ సిబ్బందితో సమన్వయం చేసుకుని, ఎప్పటికప్పుడు చెత్తను ఎత్తివేయాలని సూచించారు  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా, డీఈ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) చందనా చౌహన్, శానిటరీ సూపర్ వైజర్ బుచ్చయ్య, శానిటరీ జవాన్ సాయికృష్ణ, ఎస్ ఎఫ్ఏలు మహేశ్ గౌడ్, గణేశ్ రెడ్డి, శ్రీరాములు, రమేశ్ పాల్గొన్నారు.