18-09-2025 10:23:19 PM
శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్: లింగోజిగూడ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన నేపథ్యంలో గురువారం విగ్రహ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారన్నారు. దళిత సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు నూతన విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చానని, ఇచ్చిన హామీ మేరకు నూతన విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశానని చెప్పారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా విగ్రహాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తిలక్ రావు, దళిత సంఘాల నాయకులు పార్శపు శ్రీధర్, వెంకట్ రమణ, రాంబాబు, దేవరాజ్, వెంకటేశ్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, నర్సింగ్ రావు, గోపినాథ్, ఆనంద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.