calender_icon.png 19 September, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ అశోక్ ని పరామర్శించిన ఎమ్మెల్యే

18-09-2025 10:44:06 PM

వనస్థలిపురం ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న అశోక్ 

ఎల్బీనగర్: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరాహారదీక్ష చేస్తున్న ప్రొఫెసర్ అశోక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అశోక్ ని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దవాఖానకు వెళ్లి అశోక్ ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల ఆకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారన్నారు. రెండు లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ జాబ్ క్యాలెండర్, గ్రూప్1 లో జరిగిన అవకతవకల ప్రభుత్వం వైఫల్యం కారణంగా గత సంవత్సరం కాలంగా నష్టపోతున్న నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నాలుగు రోజులుగా అశోక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. అశోక్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వనికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల న్నారు. ఎమ్మెల్యే వెంట వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ తదితరులు ఉన్నారు.