24-07-2025 01:07:11 AM
హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): భారీ వర్షాలు పడుతున్నం దున హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు సూచించారు. వరద వచ్చినప్పుడు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని.. క్యాపిట్స్ అన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.
నగరంలో వరద నిలిచే రహదారులతో పాటు కాలువల్లో సిల్ట్ తొలగించే పనులను బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఆరాంఘర్ చౌరస్తా, కాటేదాన్ ప్రాంతాలతో పాటు రాజ్‌భవన్ మార్గాలలో నీట మునుగుతున్న రహదారులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. కొత్తగూడ చౌరస్తాలో ఇటీవల వరద నీరు నిలిచిన ఆర్ యూ బీ వద్ద తీసుకున్న చర్యలను పర్యవేక్షించారు.
గచ్చిబౌలిలోని ఇంద్రా కాలనీలోని లోతట్టు ప్రాంతమైన గమన్ ఆసుపత్రి చేరువలో భారీ ఎత్తున నీరు నిలవడానికి గల కారణాలను పరిశీలించారు. బయోడైవర్సిటీ వద్ద వరద నీరు పోటెత్తే ప్రాంతాన్ని జీహె ఎంసీ కమిషనర్ కర్ణన్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీబీ గజరావు భూపాల్‌తో కలిసి హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
నీరు నిల్వకుండా చర్యలు:కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ నగరంలో వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్న ప్రాంతాలపై జీహెఎంసీ ప్రత్యే క దృష్టి సారించింది. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు.
బుధవారం కమిషనర్ కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతర సిబ్బందితో కలిసి శేరిలింగంపల్లి జోన్‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి, సూచనలు చేశారు.