calender_icon.png 25 July, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తులో కారు ఎక్కి వ్యక్తి హల్‌చల్

24-07-2025 01:07:46 AM

కూకట్‌పల్లి జులై 23 (విజయక్రాంతి): గంజాయి మత్తులో ఓ వ్యక్తి కారు ఎక్కి హల్చల్ చేసి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సామాజిక మధ్యమాల ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మూసాపేట మెట్రో పిల్లర్ 893 సమీపంలోకి కారులో ప్రయాణిస్తున్న వారి కారు ముందు భాగం పైకి  సడన్ గా వచ్చిన ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తున్న దంపతులను భయభ్రాంతులకు గురిచేశాడు.

ఈ విషయం సామాజిక మధ్యమాల లో వైరల్ గా మారింది. ఇప్పటికీ కారులో ప్రయాణిస్తున్న వారు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో పోలీసులు సుమోటో కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నామని కూకట్ పల్లి సీఐ తెలిపారు.